భారతదేశం, ఏప్రిల్ 7 -- దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం ట్రేడింగ్‌లో భారీ క్షీణతను చూసింది. ఇది పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఇంట్రాడే ట్రేడింగ్‌లో 7.4 శాతం క్షీణించి 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. రోజు చివరిలో 2.78 శాతం తగ్గి రూ.1171 వద్ద ముగిసింది.

అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తుందనే భయాల కారణంగా ప్రపంచ మార్కెట్లలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇది భారత స్టాక్ మార్కెట్‌ను కూడా ప్రభావితం చేసింది. అందువలన రిలయన్స్ షేర్లలో అమ్మకాలు జరిగాయి. దీని వలన షేరు ధర గణనీయంగా తగ్గింది.

గత 6 ట్రేడింగ్ రోజుల్లో రిలయన్స్ షేర్లు 12.7శాతం పడిపోయాయి. దీని వలన ఆర్‌ఐఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.26 లక్షల కోట్లు తగ్గింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రిలయన్స్ దేశంలోనే అతిపెద్ద కంపెనీ, ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజే...