Hyderabad, సెప్టెంబర్ 23 -- కౌన్ బనేగా కరోడ్‌పతి 17వ సీజన్ తాజా ఎపిసోడ్‌లో అమితాబ్ బచ్చన్ తన భార్య, నటి, పొలిటిషియన్ అయిన జయా బచ్చన్ గురించి ఫన్నీ కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా తమ మధ్య ఎత్తులో ఉన్న తేడా గురించి ఒక జోక్ వేశాడు. అతడు ఆశా ధిర్యన్ అనే ఒక కంటెస్టెంట్‌తో మాట్లాడుతూ ఆమెను 'అద్భుత మహిళ'గా వర్ణించి అందరినీ నవ్వించే ఒక జోక్ వేయడం విశేషం.

సోనీ లివ్ ఓటీటీతోపాటు సోనీ టీవీలో ప్రస్తుతం కేబీసీ 17వ సీజన్ ప్రసారమవుతోంది. ఈ షోలో ఆశా అనే కంటెస్టెంట్ అమితాబ్‌ను తన భార్య జయను పొగడమని అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానంగా.. "దేవీజీ, మా పెళ్ళై 52 సంవత్సరాలు అయ్యింది. ఆమె 52 సంవత్సరాల నుండి నన్ను భరించారు. దీని కంటే పెద్ద పొగడ్త ఇంకేముంటుంది?" అని అనడం విశేషం.

అలా చెప్పిన తర్వాత అతడు నవ్వడం మొదలుపెట్టాడు. ఆశా తన జీవితం, ప్రేమ కథ గురించి మాట్లాడింది. తన భర...