భారతదేశం, సెప్టెంబర్ 6 -- బాలీవుడ్ సీనియర్ నటి ఊర్మిళ మటోండ్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 90వ దశకంలో తన అందం, నటనతో కుర్రకారును ఉర్రూతలూగించారు. ఇప్పుడు 51 ఏళ్లు వచ్చినా, ఆమె అందం, ఆత్మవిశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. సినిమాల్లో అప్పుడప్పుడు కనిపించినా, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు ఆకట్టుకున్నాయి. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని ఆమె మరోసారి నిరూపించారు.

సాధారణంగా చీరలు, సాంప్రదాయ దుస్తుల్లో ఎక్కువగా కనిపించే ఊర్మిళ, ఈసారి తన స్టైల్ మార్చారు. ఒక స్టైలిష్ మినీ స్కర్ట్‌లో అదరగొట్టారు. ఆమె ధరించిన అవుట్‌ఫిట్ చూస్తే, నేటితరం హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా ఉంది. "సెప్టెంబర్ మొదటి వారం వైపు ఒక బాస్ లేడీలా నడుస్తూ..." అని క్యాప్షన్ పెట్టి, ఈ ఫోటోలను ఆమె సెప్టెంబర్ 4న ఇన...