భారతదేశం, డిసెంబర్ 27 -- చిన్న సినిమాలను ప్రమోట్ చేయడంలో యంగ్ హీరో సందీప్ కిషన్ ఎప్పుడూ ముందే ఉంటాడు. తాజాగా పతంగ్ మూవీని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ మీట్ లో మూవీ లవర్స్ కు సందీప్ కిషన్ ఓ బంపరాఫర్ ఇచ్చాడు. పతంగ్ సినిమా 500 టికెట్లు ఫ్రీగా ఇవ్వడంతో పాటు తన వివాహ భోజనంబు రెస్టారెంట్లలో 20 శాతం డిస్కౌంట్ ఇస్తానని చెప్పాడు.

పతంగ్ మూవీ సక్సెస్ మీట్ లో సందీప్ కిషన్ కామెంట్లు వైరల్ గా మారాయి. ఇవాళ (డిసెంబర్ 27) పతంగ్ మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. దీనికి సందీప్ కిషన్ గెస్ట్ గా వచ్చాడు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా కోసం నా సైడ్ నుంచి రేపు థియేటర్లో చూసేందుకు 500 టికెట్లు ఇస్తా. ఆదిత్య మేరుగు ట్విటర్ ఐడీ ఇస్తా. అతణ్ని సంప్రదించండి. ఇది కాకుండా మొన్న శంబాలకు కూడా చెప్పా. ఇప్పుడు కూడాపతంగ్ కు అదే చెప్తున్నా. ఈ సినిమా...