భారతదేశం, నవంబర్ 18 -- బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే చేసిన తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇకపై ఆమె భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ల్లో భాగం కాదనే అర్థం వచ్చేలా మాట్లాడింది. పదేళ్లకు పైగా భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించి, బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో భాగమైన దీపికా తన ఆలోచన విధానాన్ని మార్చుకుంది. హార్పర్'స్ బజార్‌తో ఇటీవల ఇంటర్వ్యూలో దీపికా ఈ కామెంట్లు చేసింది.

బాక్సాఫీస్ మైల్ స్టోన్స్, భారీ బడ్జెట్ సినిమాలు తనను అంతగా ఆకర్షించడం లేదని దీపికా పదుకొణే తెలిపింది. ''ఇకపై రూ.100 కోట్ల లేదా రూ.500 కోట్ల చిత్రాల గురించి కాదు. నా ప్రాధాన్యతలు గణనీయంగా మారాయి. ఈ దశలో ఇకపై అది రూ.100 కోట్ల చిత్రాలు లేదా రూ.500-600 కోట్ల చిత్రాలు అని ఆలోచించను'' అని దీపికా చెప్పింది.

"నాకు నిజమనిపించనిది ఏదీ నన్ను ఆకట్టుకోదు. కొన్నిసార్లు ప్రజలు ...