భారతదేశం, ఫిబ్రవరి 16 -- టెక్నాలజీ ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతారనే ఆందోళన అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాజీ సీఈఓ, సంపర్క్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వినీత్ నాయర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఏఐ ప్రభావంతో 50 శాతం ఉద్యోగాలు పోతాయనేది వాస్తవమే అయినా, దానికి సమానంగా కొత్త ఉద్యోగాల సృష్టి కూడా జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఢిల్లీలో జరిగిన 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'లో పాల్గొన్న వినీత్ నాయర్, రాబోయే మార్పులను విశ్లేషించారు. "మనం స్పష్టంగా గమనించాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. ఆటోమేషన్ కారణంగా ప్రస్తుతమున్న ఉద్యోగాల్లో 50 శాతం పోతాయి. కానీ, టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా మరో 50 శాతం కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. టెక్నాలజీ సాయంతో...