భారతదేశం, జనవరి 21 -- ఆధ్యాత్మికత, విద్య, సామాజిక సేవా రంగాల్లో చిన్మయ మిషన్ 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ నగరం ఒక అరుదైన వేడుకకు వేదిక కాబోతోంది. 2026 జనవరి 24, 25 తేదీల్లో సికింద్రాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో 'అమృత మహోత్సవం' పేరిట ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. పూజ్య గురుదేవ స్వామి చిన్మయానంద సరస్వతి ఆశయాలకు అనుగుణంగా సాగుతున్న ఈ సంస్థ, తన సేవా ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ భక్తులను, విద్యార్థులను, యువతను ఈ వేడుకలకు సాదరంగా ఆహ్వానిస్తోంది.

భగవద్గీత, ఉపనిషత్తుల సారాన్ని సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చేయడమే లక్ష్యంగా స్వామి చిన్మయానంద (1916-1993) తన జీవితాన్ని అర్పించారు. ఒక జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి, హిమాలయాల్లో వేదాంత జ్ఞానాన్ని పొందిన ఆయన, 1951లో పుణేలో తొలి గీతా జ్ఞాన యజ్ఞా...