భారతదేశం, నవంబర్ 17 -- అతిపెద్ద పైరసీ వెబ్‌సైట్‌గా పేరు తెచ్చుకున్న ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు ఛాలెంజ్ విసిరిన ఐబొమ్మ ఆర్గానైజర్‌ ఇమ్మడి రవిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఐ బొమ్మ రవి జైల్లో ఉన్నాడు. ఇమ్మడి రవి అరెస్ట్‌పై సీపీ సజ్జనార్ తాజాగా సినీ ప్రముఖులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇమ్మడి రవి కేసు, పైరసీపై సీపీ సజ్జనార్ సంచలన నిజాలు బయటపెట్టారు.

ఐ బొమ్మ ఇమ్మడి రవి నుంచి స్వాధీన పరుచుకున్న హార్డ్ డిస్క్‌లలో సుమారు 21 వేలకుపైగా సినిమాలు ఉన్నాయని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ పైరసీ ద్వారా రవి రూ. 20 కోట్ల వరకు సంపాదించాడని పేర్కొన్నారు. అందులో రూ. 3 కోట్లు ఫ్రీజ్ చేసినట్లుగా సీపీ సజ్జనార్ వెల్లడించారు.

అంత...