భారతదేశం, నవంబర్ 6 -- రాజమౌళి తెరకెక్కిన 'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి: ది కంక్లూజన్' సినిమాలను కలిపి రూపొందించిన మూవీ 'బాహుబలి: ది ఎపిక్'. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా నటించిన ఈ రీమాస్టర్ వెర్షన్ అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైంది.

తొలి రోజు నుంచి మంచి కలెక్షన్స్ అందుకున్న బాహుబలి ది ఎపిక్ ఆరు రోజుల్లోనే రూ. 50 కోట్ల కలెక్షన్స్‌ను దాటేసినట్లు సమాచారం. వరల్డ్ వైడ్‌గా బాహుబలి సినిమాకు ఆరు రోజుల్లో రూ. 53 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చాయి.

అలాగే, కర్ణాటక నుంచి రూ. 5 కోట్లు, ఓవర్సీస్ ద్వారా రూ. 12 కోట్లు కలెక్ట్ అయినట్లు సమాచారం. దీంతో ఏడు రోజుల్లో బాహుబలి ది ఎపిక్ మూవీ రూ. 60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్న...