భారతదేశం, నవంబర్ 16 -- సినీ దిగ్గజాలు రజనీకాంత్, నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ ఇద్దరు లెజండ్లను రాబోయే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI-ఇఫ్ఫీ) ముగింపు వేడుకల్లో సన్మానించనున్నారు. సినిమా రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఘన సత్కారం చేయబోతున్నారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ విలేకరులకు ఈ సమాచారం అందించారు.

"భారతీయ సినిమా సంస్కృతిపై వారి నిరంతర ప్రభావాన్ని తెలిపే ఈ మైలురాయిని పురస్కరించుకుని రజనీకాంత్, నందమూరి బాలకృష్ణలకు సన్మానం చేస్తాం. సినిమా రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ఈ సత్కారం'' అని మురుగన్ తెలిపారు. "వారి అద్భుతమైన నటన, విస్తృతమైన ప్రజాదరణ, దశాబ్దాలుగా భారతీయ కథనాలకు రూపాన్నిచ్చిన వారి కృషికి గుర్తింపుగా ముగింపు వేడుకల్ల...