భారతదేశం, జనవరి 14 -- బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, ఫిట్‌నెస్ ఫ్రీక్ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 50 ఏళ్ల వయసులోనూ తన గ్లామర్, డ్యాన్స్ మూవ్స్‌తో కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుంటారు. ఇటీవల ఆమె హనీ సింగ్‌తో కలిసి చేసిన ఆల్బమ్, అలాగే 'థామా' చిత్రంలో రష్మిక మందన్నాతో చేసిన స్పెషల్ సాంగ్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు.

అయితే, ఈ వయసులో ఇలాంటి 'ఐటమ్ సాంగ్స్' అవసరమా అంటూ సోషల్ మీడియాలో మలైకా అరోరాపై ట్రోలింగ్ కూడా గట్టిగానే జరుగుతోంది. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మలైకా ఈ విమర్శలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది మలైక అరోరా.

"నేను ఈ ఇమేజ్‌ను ఎందుకు వదులుకోవాలి? దీని గురించి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏముంది?" అని మలైకా సూటిగా ప్రశ్నించారు. "చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు, ట్రోల్ చేస్తారు. కానీ, ఇందులో అంత పెద్ద తప్ప...