భారతదేశం, డిసెంబర్ 5 -- ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రాబోతోంది. ఇవాళ (డిసెంబర్ 5) నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. డిఫరెంట్ స్టోరీ లైన్ తో వస్తున్న ఈ సిరీస్ లో 50 ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి వారం ఓ కొత్త ఎపిసోడ్ రిలీజ్ కానుంది. ఆ సిరీస్ పేరు 'ధూల్‌పేట్ పోలీస్ స్టేష‌న్‌'. ఈ సిరీస్ స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడున్నాయి.

క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ధూల్‌పేట్ పోలీస్ స్టేష‌న్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇవాళ నుంచే స్ట్రీమింగ్ కానుంది. శుక్రవారం రాత్రి 7 గంటలకు ఫస్ట్ ఎపిసోడ్ అందుబాటులోకి వస్తుంది. ఆహా ఓటీటీలో తెలుగు, తమిళంలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ రోజు ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత ప్రతి వారం ఒక్క ఎపిసోడ్ విడుదల అవుతుంది.

ఆహా ఒరిజినల్ సిరీస్ గా తెరకెక్కింది ధూల్‌పేట్ పోలీస్ స్టేష‌న్‌. ఇది తెలుగు, తమిళంలో అందుబాటులోకి వస్త...