భారతదేశం, జనవరి 26 -- మహీంద్రా ఎలక్ట్రిక్ పోర్ట్ ఫోలియోలో BE 6, XEV 9e చేరాయి. ఇవి ఎన్సీఏపీలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందాయి. టెస్ట్ డ్రైవ్ ఫేజ్-1 పూర్తయిన తర్వాత, కంపెనీ ఇప్పుడు ఫేజ్-2 (జనవరి 24)ను ప్రారంభించింది. ఈ కొత్త దశలో 15 కొత్త నగరాలను చేర్చారు. వీటిలో అహ్మదాబాద్, భోపాల్, కొచ్చిన్, కోయంబత్తూర్, గోవా, హౌరా, ఇండోర్, జైపూర్, జలంధర్, కోల్‌కతా, లక్నో, లుధియానా, సూరత్, వడోదర, చండీగఢ్ ట్రైసిటీ ఉన్నాయి.

మహీంద్రా బీఈ 6 డిజైన్ విషయానికి వస్తే ఇందులో 'బీఈ' లోగో, తాత్కాలిక ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ (డీఆర్ఎల్), ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ కనెక్టెడ్ టెయిల్లైట్స్, నిటారుగా ఉండే రూఫ్‌లైన్ ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్, ఫ్లోటింగ్ ఫ్రంట్ స్పాయిలర్, హై బెల్ట్‌లైన్, పియానో బ్లాక్ వీల్ ఆర్చ్ క్లాడింగ్, ఏరో ఇన్సర్ట్స్తో కూడిన ...