భారతదేశం, మే 14 -- మైక్రోసాఫ్ట్, క్రౌడ్ స్ట్రైక్, మెటా, బ్లాక్ వంటి దిగ్గజాలు లే ఆఫ్ ప్రకటించడంతో 2025 ప్రారంభం నుంచి యూఎస్ లో ఇప్పటివరకు సుమారు 60,000 టెక్ ఉద్యోగాలు కనుమరుగయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం, ఖర్చును తగ్గించుకునే ప్రయత్నాలు, ఫెడరల్ ఉద్యోగుల తొలగింపు వంటి కారణాలతో టెక్, ప్రభుత్వ రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది.

లేఆఫ్ ట్రాకర్ వెబ్సైట్ లేఆఫ్స్.ఎఫ్వైఐ (layoffs.fyi) ఈ డేటాను బయటపెట్టింది. ఫెడరల్ డిపార్ట్మెంట్లతో పాటు అమెరికాలోని పలు పారిశ్రామిక రంగాల్లో రియల్ టైమ్ లేఆఫ్ డేటాను ఇది ట్రాక్ చేస్తుంది. టెక్ క్రంచ్ ప్రకారం ఒక్క ఏప్రిల్ నెలలోనే 23,400 టెక్ ఉద్యోగాలు పోయాయి. నేషనల్ పార్క్ సర్వీస్ తో సహా ప్రభుత్వ సంస్థలు వేలాది మందిని ఇంటికి పంపించేశాయి. ఇతర ఉద్యోగులను తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని, సర...