భారతదేశం, జూన్ 9 -- రోలాండ్ గారోస్ లో సరికొత్త హిస్టరీ క్రియేట్ అయింది. ఏకంగా అయిదు గంటల 29 నిమిషాల పాటు సాగిన ఫ్రెంచ్ ఓపెన్ 2025 ఫైనల్ కొత్త రికార్డు నమోదు చేసింది. ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ఫైనల్ గా ఇది నిలిచింది. ఆదివారం (జూన్ 8)న డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్, జానిక్ సినర్ మధ్య ఈ మెగా పోరు జరిగింది. ఇద్దరు ఆటగాళ్లు టైటిల్ కోసం కొదమ సింహాల్లా పోటీపడ్డారు.

రికార్డు ఫైనల్లో కార్లోస్ అల్కరాజ్ దే విజయం. ఈ స్పెయిన్ యువ సంచలనం ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నిలబెట్టుకున్నాడు. 5 గంటల 29 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో అల్కరాజ్ 4-6, 6-7 (4-7), 6-4, 7-6 (7-3), 7-6 (10-2) తేడాతో సినర్ ను ఓడించాడు. ఆరు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరు టెన్నిస్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ అందించింది. చివరకు అల్కరాజ్ ట్రోఫీని ముద్దాడాడు.

రెండు సెట్లు కోల్పో...