భారతదేశం, జూన్ 16 -- భారత స్టాక్​ మార్కెట్​లోని మల్టీబ్యాగర్​ స్టాక్స్​లో హెచ్​బీఎల్​ ఇంజినీరింగ్​ ఒకటి. ఈ స్టాక్​ 5ఏళ్లల్లో 4000శాతానికిపైగా పెరిగింది. ఇక ఇప్పుడు, ఇజ్రాయెల్​ ఇరాన్​ ఉద్రిక్తతల మధ్య దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఒడుదొడుకులకు గురవుతున్నప్పటికీ, హెచ్​బీఎల్​ ఇంజినీరింగ్​ స్టాక్​ సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో 5శాతం వృద్ధిచెందింది. ఒక కీలక అప్డేట్​ ఉండటం ఇందుకు కారణం.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో మల్టీబ్యాగర్ స్టాక్ అయిన హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ షేర్లు బీఎస్‌ఈలో 5.04% పెరిగి రూ. 619.75కు చేరుకున్నాయి. అక్కడి నుంచి కాస్త పడి, ఉదయం 11:30 సమయంలో రూ. 598 వద్ద ట్రేడ్​ అవుతోంది.

రెండు ప్రాజెక్టుల కోసం దక్షిణ మధ్య రైల్వే నుంచి లెటర్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్ (LoA) అందుకున్నట్లు హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ వారాంతంలో ప్రకటించడంతో స్టాక్​ పెరిగింది.

మొ...