భారతదేశం, నవంబర్ 19 -- ముంబై నగరంలో 48 గంటలకు పైగా నిలిచిపోయిన సీఎన్‌జీ (కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్) సరఫరా మంగళవారం సాయంత్రం పునరుద్ధరణకు నోచుకుంది. అయితే, ఈ రెండు రోజులు గ్యాస్ లేక రోడ్లపైకి రాని టాక్సీలు, ఆటోలు, యాప్ ఆధారిత క్యాబ్‌లు ఒక్కసారిగా పంపుల వైపు పోటెత్తడంతో కిలోమీటర్ల కొద్దీ క్యూలు దర్శనమిచ్చాయి.

ముంబైకి గ్యాస్ సరఫరా చేసే గెయిల్ (GAIL) పైప్‌లైన్ దెబ్బతినడంతో మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL)కు తీవ్ర సమస్య ఎదురైంది. ఈ సమస్యను పరిష్కరించడానికి 48 గంటలకు పైగా సమయం పట్టింది. ఈ అంతరాయం కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ప్రయాణికులకు తీవ్ర కష్టాలు ఎదురయ్యాయి.

సీఎన్‌జీతో నడిచే అనేక టాక్సీలు, ఆటో రిక్షాలు, యాప్ ఆధారిత క్యాబ్‌లు సోమవారం, మంగళవారం రోజుల్లో రోడ్లపైకి రాలేదు. మరోవైపు, సీఎన్‌జీ స్టేషన్ల బయట గంటగంటకు క్యూలు పెరిగ...