భారతదేశం, డిసెంబర్ 1 -- ఇటీవల నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ వరుసగా విమర్శల పాలు అవుతున్నారు. తాజాగా నవంబర్ 30న జరిగిన సఃకుటుంబానాం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కూడా రాజేంద్ర ప్రసాద్ నోరు జారిన విషయం తెలిసిందే. బ్రహ్మానందంపై రాజేంద్ర ప్రసాద్ నోరు జారడంతో ఇంటర్నెట్‌లో ఆయనపై విమర్శల దాడి జరిగింది.

ఈ విమర్శలు, వివాదంలో పడిపోయి సఃకుటుంబానాం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన విషయాలను పక్కకు పెట్టేశారు. ఈ క్రమంలో ఆ ఈవెంట్‌లో నటుడు రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్, చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం.

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. "సభా సరస్వతికి, నా తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. బ్రహ్మానందంతో మరొకసారి కలిసిన నటించడం, మధు పనిచేసిన వారంతా ఉన్నత స్థాయిలకు అడగడం, వారిని ఈ స్టేజిపై చూడటం నాకు ఎంతో సంతోషం ఇచ్చింది" అని ...