భారతదేశం, ఏప్రిల్ 16 -- క‌న్న‌డ అగ్ర హీరోలు శివరాజ్ కుమార్, ఉపేంద్ర క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్ యాక్ష‌న్ మూవీ చేస్తోన్నారు. 45 అనే టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో రాజ్ బి శెట్టి మ‌రో ప్రధాన పాత్రలో క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమాకు అర్జున్ జ‌న్యా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పాన్ ఇండియ‌న్ మూవీగా తెరకెక్కిన 45 త్వ‌ర‌లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.45 మూవీ తెలుగు టీజర్‌ను ఇటీవ‌ల లాంఛ్ చేశారు.

హీరో ఉపేంద్ర మాట్లాడుతూ "45 మూవీలో నన్ను చాలా కొత్తగా చూపించారు దర్శకుడు అర్జున్ జన్యా. ఈ మూవీలో నా ఓం సినిమాకు సంబంధించిన ఓ డైలాగ్ ఉంటుంది. అర్జున్ జ‌న్యా వందకు పైగా సినిమాల‌కు సంగీతాన్ని అందించారు. అలాంటి క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రంతో దర్శకుడు కావడం సంతోషంగా ఉంది.

45 మూవీ స్టోరీ ఎంటి, మా క్యారెక్టర్స్ ఏంటి అనేది ప్రస్తుతానికి...