Telangana, సెప్టెంబర్ 13 -- ఓవైపు ఎదురుకాల్పుల్లో కీలక నేతలను కోల్పోతున్న మావోయిస్టు పార్టీకి మరోవైపు సీనియర్లు కూడా దూరమవుతున్నారు. తాజాగా మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్‌ సుజాతక్క(62) తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు.

తెలంగాణలోని గద్వాలకు చెందిన సుజాత. చిన్నప్పుడే అడవి బాట పట్టారు. 1984లో మావోయిస్టు అగ్ర నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీతో వివాహమైంది. జనతన సర్కార్ ఇంచార్జ్ గా పని చేసిన ఆమెపై 104 కేసులున్నట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక మహిళా నాయకురాలిగా సుజాత గుర్తింపు పొందారు. 43 ఏళ్ల పాటు మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు.

ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ సౌత్‌ సబ్‌ జోనల్‌ బ్యూరో ఇన్‌ఛార్జిగా సుజాతక్క పని చేస్తున్నట్లు తెలిసింది. చాలా ...