భారతదేశం, జూన్ 28 -- నటి షెఫాలి జరివాలా మరణం బాలీవుడ్ సినీ పరిశ్రమను, అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. 42 ఏళ్ల ఆమె శుక్రవారం రాత్రి మరణించారు. మరణానికి అధికారిక కారణం ప్రకటించనప్పటికీ, కొన్ని నివేదికలు అది గుండెపోటు అని పేర్కొన్నాయి. మరణం సహజ కారణాల వల్ల జరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ, ముంబయి పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.

శుక్రవారం (జూన్ 27) రాత్రి.. షెఫాలి జరివాలా తన అంధేరీ ఇంట్లో మరణించినట్లు సమాచారం. ఆమె భర్త పరాగ్ త్యాగి ఆమెను బెల్లేవ్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అక్కడికి చేరుకునే లోపే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ముంబయి పోలీసులు శుక్రవారం రాత్రి ఆమె మరణాన్ని ధృవీకరించారు కానీ ఇప్పటివరకు మరణానికి గల కారణాన్ని వెల్లడించలేదు. శనివారం ఉదయం శవపరీక్ష కోసం షెఫాలి మృతదేహాన్ని కూపర్ ఆసుపత్రికి తరలించ...