భారతదేశం, జూన్ 16 -- హర్రర్ కామెడీ జానర్ లో ప్రభాస్ వింటేజ్ టర్న్ గా తెరకెక్కిన రాజాసాబ్ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి. అయితే ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. చివరకు డిసెంబర్ 5న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ ఆలస్యానికి కారణాన్ని సినిమా ప్రొడ్యూసర్లు వెల్లడించారు. సోమవారం (జూన్ 16) ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా రాజాసాబ్ థియేట్రికల్ రిలీజ్ లేటు అయిందని ప్రొడ్యూసర్లు చెప్పారు. ప్రమోషన్స్ ను పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా రాజాసాబ్ టీజర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మీడియాతో ముచ్చటిస్తూ ప్రెస్ మీట్ లో సినిమా గురించి అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ సినిమా స్థాయి గురించి మాట్లాడుతూ "మారుతి (దర్...