భారతదేశం, మే 16 -- ఫోర్బ్స్ 2025 లిస్ట్ వచ్చేసింది. దీని ప్రకారం ప్రపంచ రిచెస్ట్ ప్లేయర్ ఎవరో కాదు.. ఫుట్‌బాల్‌ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రీడాకారుడిగా రొనాల్డో నిలిచాడు. వరుసగా మూడో సారి టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు. అల్ నాసర్ క్లబ్, పోర్చుగల్ జాతీయ జట్టుకు ఆడుతున్న రొనాల్డో సంపాదనలో అదరగొడుతున్నాడు. 1000 గోల్స్ రికార్డుపై కన్నేసిన రొనాల్డో ఆదాయంలోనూ హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు.

ఫోర్బ్స్ 2025 అత్యంత ధనిక క్రీడాకారుల జాబితాలో టాప్-5లో ముగ్గురు ఫుట్‌బాల్‌ ప్లేయర్లే. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్), డాక్ ప్రిస్కాట్ (అమెరికా), లియోనల్ మెస్సి (అర్జెంటీనా) టాప్-5లో ఉన్నారు. బాస్కెట్ బాల్ ప్లేయర్ స్టీఫెన్ కర్రీ (అమెరికా), బాక్సర్ టైసన్ ఫ్యూరీ (యూకే) మిగతా ఇద్దరు.

40 ఏళ్ల రొనాల్డో ఫోర్బ్స్ ప్రపంచ సంపన్న క్రీడా...