Hyderabad, జూన్ 15 -- పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన '8 వసంతాలు' ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన కాన్సెప్ట్-సెంట్రిక్ మూవీ. సూపర్ హిట్ మూవీ మ్యాడ్ హీరోయిన్ అనంతిక సనీల్‌ కుమార్ లీడ్ రోల్ పోషించారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన 8 వసంతాలు సోల్ ఫుల్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది.

ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది. 8 వసంతాలు చిత్రం జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనంతిక సనీల్‌ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ మెటీరియల్ చూస్తుంటే ఈ కథంతా మీ చుట్టూనే ఉంటుందనిపిస్తుంది?

-ఇది విమెన్‌కి సంబంధించిన కథ. ఈ కథలో అమ్మాయి పాత్ర కీలకం అయినప్పటికీ మిగతా పాత్రలన్నిటికీ సమానంగా ప్రాముఖ్యత ఉంది. ప్రతి క్యారెక్టర్ ...