Andhrapradesh, ఆగస్టు 23 -- ఏపీలో రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఆగస్టు 25 నుంచి ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు.నాలుగు దశల్లో 1 కోటీ 45 లక్షల స్మార్డ్ కార్డులను పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఆయా రేషన్ కార్డుల దుకాణాల వద్దనే గ్రామ, వార్డు సచివాలయాల సహకారంతో పంపిణీ చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది.

కొత్త రేషన్ కార్డుల పంపిణీపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం వెల్లడించారు. 6,71,000 కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని చెప్పారు. 16,67,032 రేషన్ కార్డుల అప్లికేషన్స్ కి అప్రూవల్ ఇచ్చామని. కార్డుల జారీ నిరంతర ప్రక్రియని స్పష్టం చేశారు. ఆన్ లైన్ లో ధరఖాస్తుల ప్రక్రియ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. రేషన్ పంపిణీ 93 శాతానికి పెరిగిందన్నారు.

స్మార్ట్ కార్డుల పంపిణీకి సం...