భారతదేశం, ఆగస్టు 31 -- దేశంలో బుల్లెట్ రైలు నెట్‌వర్క్‌ను విస్తరించే దిశగా ప్రభుత్వం వేగంగా కృషి చేస్తోంది. దక్షిణ భారతదేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం సర్వేకు ఆదేశాలు వెళ్లినట్టుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రతిపాదిత బుల్లెట్ రైలు నెట్‌వర్క్ దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రధాన నగరాల గుండా వెళ్తుంది. అవి ఏంటంటే.. హైదరాబాద్, చెన్నై, అమరావతి, బెంగళూరు నగరాలను కలుపనున్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పారు.

'దక్షిణ భారతదేశానికి బుల్లెట్ రైలు అతి త్వరలో రాబోతోంది. దీని కోసం ఒక సర్వేకు ఆదేశాలు వెళ్లాయి. హైదరాబాద్, చెన్నై, అమరావతి, బెంగళూరు.. నగరాల్లో చాలా జనాభా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్.' అని చంద్రబాబు అన్నారు.

మరోవైపు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ కూడా రైలు నెట్‌వర్క్ గురించి మాట్లాడారు. జపనీస్ దిన...