భారతదేశం, ఆగస్టు 27 -- తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కామారెడ్డి, మెదక్ జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కిపోయాయి. ఎటుచూసినా వరద నీరు ఏరులై పారుతోంది. చాలా కాలనీలు జలదిగ్భంధలో ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ యంత్రాగమంతా సహాయక చర్యల్లో నిమగ్నమైయింది.

భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లోని విద్యా సంస్థలకు రేపు(ఆగస్ట్ 28) సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటన విడుదల చేశారుయ

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రేపు (గురువారం) నిర్మల్ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల రవాణా, ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు.

గురువారం రోజు జిల్లాలో భారీ వర్షాలు ...