భారతదేశం, జనవరి 17 -- భారతీయ సినీ యవనికపై నాలుగు దశాబ్దాలకు పైగా చెరగని ముద్ర వేసిన నటుడు అమితాబ్ బచ్చన్. 83 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీనిచ్చే ఎనర్జీతో వరుస సినిమాలు, టీవీ షోలతో బిజీగా గడుపుతున్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.

ఉత్తమ నటుడిగా నాలుగు జాతీయ అవార్డులు అందుకున్న ఏకైక రికార్డ్ బిగ్ బి అమితాబ్ సొంతం. అయితే, ఇంతటి అనుభవం ఉన్న ఈ నట దిగ్గజం మనసులో ఒక చిన్నపాటి వెలితి ఉందట. ఆ విషయాన్ని అమితాబ్ బచ్చన్ స్వయంగా తన బ్లాగ్ ద్వారా ఎమోషనల్ అవుతూ పంచుకున్నారు.

ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటానని చెప్పే బిగ్ బి అమితాబ్ ఈసారి మాత్రం కాస్తంత నిరాశను వ్యక్తం చేశారు. "ప్రతి రోజూ ఒక కొత్త పాఠమే. కానీ, ఇప్పుడు నేర్చుకుంటున్న విషయాలను చాలా ఏళ్ల క్రితమే నేర్చుకోవాల్సింది అనే చిన్న వెలితి ఉండిపోయింది. అప్పుడు ఈ సాంకే...