భారతదేశం, డిసెంబర్ 10 -- అణగారిన అట్టడుగు వర్గాల అభ్యున్నతి, తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి చెందాలన్న దృఢ సంకల్పంతో రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను సాధించడంలో ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెండు రోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ముగింపు కార్యక్రమంలో దేశ, విదేశీ ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించి ప్రజలకు అంకితమిచ్చారు.

మంగళవారం రాత్రి జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో నీతి ఆయోగ్ వైస్-చైర్మన్ సుమన్ బెరీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్ పర్సన్ ఆనంద్ మహీంద్రా, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, కాల...