Hyderabad, జూన్ 14 -- ఓటీటీలో ఎప్పటికప్పుడు ఫ్రెష్‌ కంటెంట్‌తో సినిమాలు డిజిటల్ ప్రీమియర్ అవుతూ సందడి చేస్తుంటాయి. ప్రతి వారం వైవిధ్యమైన ఓటీటీ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే, వారంలో పదుల్లో ఓటీటీ మూవీస్ రిలీజ్ అయితే ఒక్క శుక్రవారం మాత్రం అధిక మొత్తంలో సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి.

అలా నిన్న అంటే శుక్రవారం (జూన్ 13) ఒక్కరోజే ఏకంగా నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఓ తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది. ఆ సినిమానే లెవెన్. థ్రిల్లర్స్ సినిమాలకు మంచి పేరు ఉన్న హీరో నవీన్ చంద్ర లీడ్ రోల్‌ పోషించిన సినిమానే లెవెన్.

లోకేష్ అజిల్స్ దర్శకత్వం వహించిన లెవెన్ సినిమా తెలుగు, తమిళం రెండు భాషల్లో బైలింగువల్‌గా తెరకెక్కింది. నవీన్ చంద్ర, రేయా, అభిరామి, దిలిపన్, రిత్విక, ఆడుకాలం నరేన్, కిరీటి దామ...