భారతదేశం, జూన్ 9 -- సినిమాల్లో సీనియర్ హీరోలు, తమకంటే వయసులో చాలా చిన్నవాళ్లయినా హీరోయిన్లతో రొమాన్స్ చేయడం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా వచ్చిన థగ్ లైఫ్ లో కమల్ హాసన్ ఇలాగే త్రిష, అభిరామితో రొమాన్స్ చేశారు. ఇప్పుడు త్వరలో రిలీజ్ కాబోతున్న బాలీవుడ్ ఫిల్మ్ 'సితారే జమీన్ పర్'లో 37 ఏళ్ల జెనీలియాతో 60 ఏళ్ల ఆమిర్ ఖాన్ రొమాన్స్ చేశారు. ఈ రొమాన్స్, ఏజ్ గ్యాప్ గురించి ప్రశ్నించినప్పుడు ఆమిర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, జెనీలియా డి'సౌజా కలిసి సితారే జమీన్ పర్ సినిమాలో నటించారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఆమిర్ తన మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి జానే తు యా జానే నా సినిమాతో జెనీలియాను బాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఇప్పుడు ఆమిర్, జెనీలియా మధ్య ఏజ్ గ్యాప్ 23 ఏళ్లు. ఈ నేపథ్యంలో జెనీలియాతో రొమాన్స్ చేయడంపై ఆమిర్...