భారతదేశం, ఏప్రిల్ 28 -- ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని 350 సీసీ బైక్​ సెగ్మెంట్​కి విపరీతమైన డిమాండ్​ ఉంది. తాజాగా ఈ సెగ్మెంట్​లోనే 2025 హంటర్​ 350ని లాంచ్​ చేసి, ఇతర సంస్థలతో ఉన్న పోటీని మరింత పెంచింది దిగ్గజ ఆటోమొబైల్​ కంపెనీ రాయల్​ ఎన్​ఫీల్డ్​. ఈ నేపథ్యంలో 2025 హంటర్​ 350 అప్డేట్స్​తో పాటు.. ఈ సెగ్మెంట్​లో బెస్ట్​గా ఉన్న హోండా సీబీ 350తో ఈ బైక్​ని పోల్చి ఏది బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

2025 హంటర్ 350 బైక్​ని భారతదేశంలో ఇటీవలే లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ రాయల్ ఎన్​ఫీల్డ్​. ఈ మోటార్ సైకిల్​ బేస్​ వేరియంట్ ధరలో ఎటువంటి మార్పు లేనప్పటికీ, టాప్​ వేరియంట్ ధర రూ .7,000 పెరిగింది! కొత్త రాయల్ ఎన్​ఫీల్డ్​ హంటర్ 350 రెట్రో, డాపర్, రెబెల్ అనే మూడు విభిన్న వేరియంట్లలో లభిస్తుంది. రెట్రో వేరియంట్ ధర రూ .1.50 లక్షలు (ఎక్స్-షోర...