Hyderabad, సెప్టెంబర్ 13 -- ఓటీటీ సిరీస్ 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్‌తో ఫేమ్ అయిన మౌళి తనూజ్ హీరోగా నటించిన సినిమా లిటిల్ హార్ట్స్. ఈ సినిమాలో అంబాజీపేట మ్యారేజీ బ్యాండు బ్యూటీ శివాని నాగరం హీరోయిన్‌గా చేసింది. డెబ్యూ డైరెక్టర్ సాయి మార్తాండ్ లిటిల్ హార్ట్స్ సినిమాకు దర్శకత్వం వహించారు.

లిటిల్ హార్ట్స్ సెప్టెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. రిలీజ్ రోజు నుంచి ప్రేక్షకుల ఆదరణ పొందుతూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది లిటిల్ హార్ట్స్ సినిమా. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా లిటిల్ హార్ట్స్ థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరోయిన్ శివాని నాగరం ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చింది.

హీరోయిన్ శివాని నాగరం మాట్లాడుతూ.. "లిటిల్ హార్ట్స్ సినిమాను మిగతా మీడియాతో పాటు మీమర్స్ బాగా ప్రమోట్ చేస్తున్నారు. మా సినిమాను ఒక్కొక్కరు రెండు మూడు సార్లు చ...