భారతదేశం, జూలై 12 -- సూపర్ మ్యాన్ సిరీస్ లో కొత్త సినిమా థియేటర్లకు వచ్చేసింది. శుక్రవారం (జూలై 11) ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ హాలీవుడ్ ఫిల్మ్ ఇండియాలోనూ విడుదలైంది. కానీ ఇండియాలో రిలీజైన మూవీలో కొన్ని సీన్స్ కట్ చేశారు. ముఖ్యంగా ముద్దు సన్నివేశాలు మిస్సయ్యాయి. దీనిపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సెన్సార్ బోర్డుపై మండిపడుతున్న వాళ్లపై నటి శ్రేయ ధన్వంతరి కూడా ఉంది.

హాలీవుడ్ సినిమా అంటే మినిమం ముద్దు సీన్స్ ఉంటాయి. మన ఫ్యాన్స్ కూడా అవి ఎక్స్ పెక్ట్ చేస్తారు. అలాంటిది సూపర్ మ్యాన్ సినిమాలో ఉన్న కిస్సింగ్ సీన్స్ ను ఇండియాలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్సి) కట్ చేయడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఈ మూవీలో ప్రధాన పాత్రధారులైన డేవిడ్ కోరెన్స్వెట్, రాచెల్ బ్రోస్నహాన్ మధ్య 33 సెకన్ల ముద్దు సీన్ ఉంది. కానీ ఇండియాలో రిలీజైన వర్షన్ లో ...