భారతదేశం, డిసెంబర్ 14 -- హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అంటే ఇష్టపడే వారి కోసం తాజాగా అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ ఓ సిరీస్ తీసుకొచ్చింది. దీనిపేరు భయ్: ది గౌరవ్ తివారీ మిస్టరీ. ఇది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఐఎండీబీలో 8.8 రేటింగ్ సాధించింది. 2016లో చనిపోయిన గౌరవ్ తివారీ అనే పారా నార్మల్ ఇన్వెస్టిగేటర్ జీవితం చుట్టూ తిరిగే సిరీస్ ఇది. ఎలా ఉందో తెలుసుకోండి.

గౌరవ్ తివారీ.. మన దగ్గర చాలా కొద్ది మందికే తెలిసిన వ్యక్తి. బీహార్ లోని పాట్నాలో 1984లో జన్మించిన ఈ వ్యక్తి.. పైలట్ జాబ్ వదిలి తనకు ఎంతగానో ఇష్టమైన దెయ్యాల వేట సాగించాడు. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గా ఎన్నో అలాంటి కేసులను పరిష్కరించాడు. అతని జీవితం ఆధారంగా తెరకెక్కిందే ఈ భయ్: ది గౌరవ్ తివారీ మిస్టరీ వెబ్ సిరీస్.

దీనిని అభిరూప్ ధర్ రాసిన ఘోస్ట్ హంటర్ గౌరవ్ తివారీ: ది లైఫ్ అండ్ లెగస...