Hyderabad, అక్టోబర్ 9 -- కాంతారా చాప్టర్ 1 బాక్సాఫీస్ కలెక్షన్లు రోజు 7: కాంతారా చాప్టర్ 1 విడుదలై వారం అయిన కూడా బాక్సాఫీస్ వద్ద బలంగా దూసుకుపోతోంది. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో దర్శకత్వం వహించి, నటించిన ఈ మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం భారతదేశంలో మొదటి వారంలో రూ. 300 కోట్ల కలెక్షన్లను దాటేసింది.

సక్నిల్క్ డేటా ప్రకారం, కాంతారా చాప్టర్ 1 బుధవారం అంటే ఏడో రోజున భారతదేశంలో రూ. 25 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో కన్నడ నుంచి 9 కోట్లు, తెలుగు నుంచి 3.5 కోట్లు, హిందీ బెల్ట్‌లో రూ. 8.5 కోట్లు, తమిళంలో 2.15 కోట్లు, మలయాళంలో 1.85 కోట్లు కలెక్షన్స్ ఉన్నాయి.

అయితే, ఆరో రోజుతో పోలిస్తే ఏడో రోజున కాంతార 2 కలెక్షన్స్ 27.01 శాతం వరకు తగ్గినట్లు ట్రేడ్ సంస్థ సక్నిల్క్ తెలిపింది. అయితే, ఏడు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంపర కొ...