భారతదేశం, డిసెంబర్ 7 -- బిల్లా తదితర సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన ఉష శ్రీ హీరోయిన్‌గా మారిన సినిమా ఇట్స్ ఓకే గురు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో సాయి చరణ్ హీరోగా చేశాడు. ప్రొడ్యూసర్ క్రాంతి ప్రసాద్ నిర్మించిన ఇట్స్ ఓకే గురు సినిమాకు మణికంఠ దర్శకత్వం వహించారు.

డిసెంబర్ 12న ఇట్స్ ఓకే గురు మూవీ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఇట్స్ ఓకే గురు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. డైరెక్టర్ మెహర్ రమేష్ అతిథిగా హాజరైన ఇట్స్ ఓకే గురు ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో మూవీ నిర్మాత క్రాంతి ప్రసాద్ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

ప్రొడ్యూసర్ క్రాంతి ప్రసాద్ మాట్లాడుతూ.. "చాలా మంచి టీంతో చేస్తున్న సినిమా ఇది. నేను స్వతహాగా మార్చల్ ఆర్ట్స్ ట్రైనర్‌ని. 30 గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయి. మన దైనందిన జీవితంలో చిన...