India, Oct. 25 -- డ్యూడ్ ఓటీటీ ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ తమిళ సూపర్ హిట్ మూవీ ‘డ్యూడ్’ ఓటీటీ ప్లాట్ ఫామ్, రిలీజ్ పై బజ్ నెలకొంది. ఈ లేటెస్ట్ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ కానుంది.

రూ.25 కోట్లు డ్యూడ్ సినిమా ఓటీటీ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రదీప్ రంగనాథన్ సినిమాలు లవ్ టుడే, డ్రాగన్ వరుసగా సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో డ్యూడ్ సినిమా ఓటీటీ రైట్స్ కోసం ప్లాట్ ఫామ్స్ పోటీ పడ్డాయి. చివరకు నెట్‌ఫ్లిక్స్ ఈ రైట్స్ ను రూ.25 కోట్లకు దక్కించుకుంది. ఈ మూవీ బడ్జెట్ రూ.30 కోట్లు.

ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? తమిళ మూవీ డ్యూడ్ అక్టోబర్ 17, 2025న రిలీజ్ అయింది. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, శరత్ కుమార్, రోహిణి, ఐశ్వర్య శర్మ, వినోదిని తది...