భారతదేశం, జూన్ 1 -- కెనడాలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఓ వ్యక్తి రూ. 30కోట్లు విలువ చేసే లాటరీని దక్కించుకున్నాడు. అది తన గర్ల్​ఫ్రెండ్​ పేరు మీద మార్చాడు. ఆ తర్వాత, ఆమె కనిపించకుండా పోయింది. చివరికి, తన గర్ల్​ఫ్రెండ్​ని ఆమె లవర్​తో కలిసి బెడ్​ మీద చూశాడు ఆ కెనడా వ్యక్తి.

విన్నిపెగ్​కి చెందిన లారెన్స్​ క్యాంప్​బెల్​ 2024లో ఒక లాటరీ టికెట్​ కొన్నాడు. లాటరీ గెలిచాడు. అందులో భాగంగా అతనికి 5 మిలియన్ల కెనెడియన్​ డాలర్లు (సుమారు రూ. 30కోట్లు)లభించాయి. అయితే ఆ వ్యక్తికి సరైన ఐడీ లేదు. అందుకే సొంతంగా ప్రైజ్​ మనీని పొందలేకపోయాడు.

2024లో క్రిస్టల్​ ఆనా మెక్​కే అనే మహిళతో క్యాంప్​బెల్​ రొమాంటిక్​ రిలేషన్​లో ఉన్నాడు. ఆమె చాలా లాయల్​ అని, నమ్మకస్తురాలని విశ్వసించాడు.

ప్రైజ్​ మనీ తనకు రావడం లేదని, ఏదైనా సలహా ఇవ్వమని లాటర...