భారతదేశం, అక్టోబర్ 28 -- అందం, డ్యాన్స్, యాక్టింగ్ తో అదరగొట్టే తమన్నా భాటియా వయసు ఇప్పుడు 35 ఏళ్లు. ఒకప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలు చేసిన ఈ మిల్కీ బ్యూటీ ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ తో సెన్సేషనల్ గా మారింది. తాజాగా 30 ఏళ్ల వయస్సులో ఉన్న హీరోయిన్ల పట్ల సినీ ఇండస్ట్రీలో మారుతున్న మనస్తత్వం గురించి ఆమె మాట్లాడింది. తెరపై వయస్సు, అనుభవాన్ని ఎలా ఎక్కువగా గౌరవిస్తున్నారో ఆమె స్పష్టం చేసింది.

ఫిల్మ్ ఫేర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా తన ప్రయాణం గురించి ఆలోచిస్తూ, తాను పరిశ్రమలోకి వచ్చినప్పుడు పదేళ్ల ప్లాన్ పెట్టుకున్నట్లు వెల్లడించింది. 30 ఏళ్లలోకి వచ్చిన హీరోయిన్ల పట్ల సినీ ఇండస్ట్రీ చూసే విధానం గురించి తమన్నా మాట్లాడింది.

"అవును, కచ్చితంగా. 30 ఏళ్లు దాటిన హీరోయిన్లను చూసి మనస్తత్వం మారింది. ఈ వయస్సు వర్గానికి చెందిన మహిళల కోసం ఇప్పుడు మరిన్ని...