భారతదేశం, ఫిబ్రవరి 12 -- చాలా మంది డబ్బు సంపాదిస్తారు, కానీ వాటిని ఎలా ఉపయోగించాలో తెలియక.. అనవసరమైన ఖర్చులు పెడుతుంటారు. జీతం తక్కువగా ఉన్నా.. కచ్చితంగా మీకు ఆర్థిక క్రమశిక్షణ అనేది ఉండాలి. లేదంటే చిన్న వయసులోనే అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. చాలా మంది డబ్బు సంపాదించినా.. వాటిని చక్కగా నిర్వహించలేకపోతున్నారు. దీనివల్ల అప్పుల భారం పడటం మెుదలవుతుంది. దీని కారణంగా వారి సిబిల్ స్కోరు కూడా తగ్గుతుంది. భవిష్యత్తులో రుణం కావాలన్నా.. ఇబ్బందులు పడుతుంటారు. 30 ఏళ్లలోపు ఈ 5 అలవాట్లు చేసుకుంటే మీరు భవిష్యత్తులో ఆర్థిక భద్రతతో ఉండవచ్చు.

మీరు పదే పదే రుణాలు తీసుకొని వాటిని సకాలంలో తిరిగి చెల్లించకపోతే ఇది మీ CIBIL స్కోర్‌ను దెబ్బతీస్తుంది. మీ సిబిల్ స్కోర్‌ను మెరుగుపరచుకోవడానికి, అన్ని బిల్లులు, లోన్ ఈఎంఐలను సకాలంలో చెల్లించండి. ఏ చెల్లింపులను డి...