భారతదేశం, ఆగస్టు 31 -- ఈ సంవత్సరం బంగారం, వెండిలో రేటు పెరుగుతోంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు వెండి దాదాపు 30 శాతం రాబడిని ఇచ్చింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వెండి పెరుగుతున్న వేగంతో, దాని ధర త్వరలో కిలోకు రూ. 2 లక్షలకు చేరుకుంటుందని తెలుస్తోంది. 2028 నాటికి వెండి ధరలు కిలోకు రూ. 2,00,000 వరకు పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు.

దేశంలో వెండి వాడకం కేవలం ఆభరణాలకే పరిమితం కాదు. దేవాలయాలలో కానుకల నుండి పరిశ్రమ వరకు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వెండికి డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దీని కారణంగా వెండి ధర కూడా వేగంగా పెరుగుతోంది. బంగారంలో మాత్రమే కాకుండా.. వెండిలో కూడా పెట్టుబడి పెట్టడం లాభదాయకమైన ఒప్పందం అని నిపుణులు అంటున్నారు.

సీఏ నితిన్ కౌశిక్ మాట్లాడుతూ, వెండి ధర కిలోకు రూ. 2 లక్షలకు చేరుకోవచ్చని చెప్పారు. ఇది చా...