భారతదేశం, డిసెంబర్ 19 -- స్కూళ్లకు వెళ్లే పిల్లలకు సెలవులంటే చాలు ఎగిరి గంతెస్తారు. ప్రతి నెలలో ఏమైనా హాలీ డేస్ ఉన్నాయా లేవా అని చూస్తుంటారు. అయితే ఈ డిసెంబర్ నెలలో క్రిస్మస్ తప్ప పెద్దగా సెలవులు ఉండవు. ఈ సెలవులు కూడా స్కూళ్లను బట్టి ఉంటాయి. అధికారికంగా ఒకటి రెండు రోజులు సెలవులు మాత్రమే ఉంటాయి. అయితే ఈసారి రాబోయే క్రిస్మస్ కోసం ఇచ్చే సెలవులను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది.

డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండగ ఉండటంతో సెలవు ఉంటుంది. డిసెంబర్ 24వ తేదీన ఆప్షనల్ హాలీ డేగా క్రిస్మస్ ఈవ్ ఉంటుంది. మరుసటి రోజు బాక్సింగ్ డే ఉండటంతో ఆరోజు(డిసెంబర్ 26) కూడా సెలవుగా నిర్ణయించారు. దీంతో సాధారణ పాఠశాలలకు కూడా వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి.

కానీ మిషనరీ స్కూళ్లకు మాత్రం ఎక్కువగా హాలీ డేస్ ఉంటాయి. ఈ తరహా స్కూళ్లకు ఈనెల 23 లేదా 24వ తేదీ నుంచి సెలవులు...