భారతదేశం, ఆగస్టు 17 -- కూలీ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. కలెక్షన్లు కుమ్మేస్తోంది. రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోంది. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న ఈ మూవీ రిలీజైంది. మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. మరోసారి తలైవా పవర్ ను చాటింది ఈ ఫిల్మ్.

కూలీ సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సంవత్సరం ఈ ఘనత సాధించిన మొదటి తమిళ చిత్రంగా నిలిచింది. కూలీ ప్రపంచవ్యాప్త బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ చూసుకుంటే శనివారం (ఆగస్టు 16) రూ.38.50 కోట్ల నెట్ వసూళ్లు సొంతం చేసుకుంది. దీంతో ఇండియాలోనే ఈ సినిమాకు మూడు రోజుల్లో మొత్తం రూ.158.25 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి.

ఇండియాలో కూలీ సినిమా గ్రాస్ కలెక్షన్లు చూసుకుంటే రూ.187 కోట్లుగా ఉన్నాయి. ఇక ఓవర్సీస్...