Hyderabad, ఆగస్టు 1 -- ఓటీటీలో వస్తోన్న సరికొత్త తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ మయసభ: రైజ్ ఆఫ్ ది టైటాన్స్. హీరోలు ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రలు పోషించిన ఈ ఓటీటీ సిరీస్ మయసభకు టాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వం వహించారు.

టీజర్‌తో సన్సేషన్ క్రియేట్ చేసిన మయసభ ట్రైలర్‌ను గురువారం (జూలై 31) విడుదల చేశారు. ఈ సందర్భంగా మయసభ ట్రైలర్ లాంచ్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన హీరో సాయి దుర్గ తేజ్ ఓటీటీ తెలుగు పొలిటికల్ సిరీస్ మయసభపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ .. "దేవా గారితో నాది పదేళ్ల ప్రయాణం. 'ఆటోనగర్ సూర్య' చూసిన వెంటనే దేవా గారికి ఫోన్ చేసి మాట్లాడాను. అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది. అలా ఆ జర్నీ నుంచి 'రిపబ్లిక్'కు వచ్చి...