భారతదేశం, డిసెంబర్ 29 -- గడిచిన శుక్రవారం (డిసెంబర్ 26) భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి స్పష్టమైన సంకేతాలు లేకపోవడం, ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో సూచీలు వెనకడుగు వేశాయి. సెన్సెక్స్ 367 పాయింట్లు (0.43%) పతనమై 85,041 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 100 పాయింట్లు (0.38%) కోల్పోయి 26,042 వద్ద ముగిసింది.

అయినప్పటికీ, మార్కెట్ నిపుణులు ఈ వారం కొన్ని స్టాక్స్‌లో లాభాల అవకాశాలను చూస్తున్నారు. 29 డిసెంబర్ ట్రేడింగ్ సెషన్ కోసం మార్కెట్‌స్మిత్ ఇండియా సూచించిన రెండు బెస్ట్ స్టాక్స్ ఇవే:

ప్రభుత్వ రంగ దిగ్గజం సెయిల్ ప్రస్తుతం పెట్టుబడికి ఆకర్షణీయంగా కనిపిస్తోందని నిపుణులు పేర్కొన్నారు. దేశీయంగా మౌలిక సదుపాయాల కల్పన పెరుగుతుండటం ఈ సంస్థకు పెద్ద ప్లస్ పాయింట్.

సొంతంగా ఇనుప గనులను కలిగి ఉండటం, ఖర్చులను తగ్గించుకోవ...