Hyderabad, మార్చి 22 -- 28 Degree Celsius Cheliya Cheliya Song Released: "పొలిమేర" చిత్రం విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్. ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా "28degC (28 డిగ్రీ సెల్సియస్)". రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 28 డిగ్రీ సెల్సియస్ మార్చి 28న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ఎమోషనల్ గా సాగే అద్భుతమైన ప్రేమ కథతో తెరకెక్కిన 28 డిగ్రీ సెల్సియస్ సినిమాలో నవీన్ చంద్ర హీరోగా నటించగా.. షాలినీ వడ్నికట్టి హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. 28 డిగ్రీ సెల్సియస్ చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. తాజాగా శుక్రవారం (మార్చి 21) రోజు 28 డిగ్రీ సెల్సియస్ సినిమా నుంచి 'చెలియా చెలియా..' సాంగ్ రిలీజ్ చేశారు.

'చెలియా చెలియా..' సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ శ్ర...