భారతదేశం, జనవరి 9 -- అజయ్ దేవ్‌గణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ 'దే దే ప్యార్ దే 2' మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా 28 ఏళ్ల అమ్మాయి, 52 ఏళ్ల పురుషుడి మధ్య లవ్ చూట్టూ సాగుతుంది.

శుక్రవారం చాలా సినిమాలే ఓటీటీలోకి వచ్చాయి. అందులో ఒకటి దే దే ప్యార్ దే 2. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీ ఇవాళ (జనవరి 9) నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ప్రేక్షకులు, విమర్శకుల నుంచి సానుకూల స్పందనను అందుకుంది ఈ మూవీ. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రశంసలు దక్కించుకుంది. చలికాలంలో హాయిగా నవ్వుకోవడానికి ఇది సరైన సినిమా.

2019లో వచ్చిన సూపర్ హిట్ మూవీ దే దే ప్యార్ దే మూవీకి సీక్వెల్ ఈ దే దే ప్యార్ దే 2. ఇందులో అజయ్ దేవ్‌గణ్, రకుల్ ప్రీత్ సింగ్.. ఆశ...