భారతదేశం, జూలై 15 -- వెస్టిండీస్ క్రికెట్ జట్టు టెస్టుల్లో చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్ లో రెండో అత్యల్ప స్కోరు రికార్డును విండీస్ మూటగట్టుకుంది. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఈ కరీబియన్ టీమ్ కేవలం 27 పరుగులకే కుప్పకూలింది. అయితే ఓ టెస్టు ఇన్నింగ్స్ లో అతి తక్కువ స్కోరు రికార్డు న్యూజిలాండ్ పేరు మీద ఉంది. 1955లో ఆక్లాండ్‌లో ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ 26 పరుగులే చేసింది.

వెస్టిండీస్ తో డేనైట్ టెస్టులో ఆసీస్ పేసర్లు చెలరేగిపోయారు. రెండో ఇన్నింగ్స్ లో విండీస్ ను కుప్పకూల్చారు. టెస్ట్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరుకు ఆలౌట్ చేసిన తర్వాత ఆస్ట్రేలియా ఫ్రాంక్ వోరెల్ ట్రోఫీని 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్ విధ్వంసంతో ఆస్ట్రేలియా కేవలం 87 బంతుల్లోనే విండీస్ ...