Hyderabad, ఆగస్టు 16 -- కూలీ 2 డేస్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్: రజనీకాంత్ స్టార్‌డమ్ ఎలాంటిదో చెప్పిన సినిమా కూలీ. 74 ఏళ్ల వయసులో కూడా రజనీకాంత్‌కు విపరీతమైన ఫాలోయింగ్ అనేదానికి ఈ సినిమానే నిదర్శనం అని బాలీవుడ్ మీడియా పేర్కొంది. అందుకు కారణం కూలీ మూవీకి వచ్చిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్.

ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదలైన కూలీ భారీ ఓపెనింగ్స్ సాధించింది. రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా కూలీ సినిమాకు రూ. 250 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చినట్లు హిందీ మీడియా పేర్కొంది. దీంతో ఈ ఏడాది 250 కోట్లు కలెక్షన్స్ సాధించిన తొలి తమిళ చిత్రంగా కూలీ మూవీ రికార్డ్ కొట్టింది.

ఇదిలా ఉంటే, స్టార్ హీరోల సినిమాలు మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించిన రెండో రోజుకు వచ్చేసరికి అవి తగ్గుతాయి. రజనీకాంత్ కూలీ సినిమాకు కూడా ఇదే జరిగింది. ఆగస్ట్ ...